ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మదర్ సెంటిమెంట్ హైలైట్ అంటోన్న పూరి!

Tue, Dec 08, 2015
పూరి జగన్నాధ్
పూరి జగన్నాధ్
సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాలో యాక్షన్ సీన్స్ .. ఆ సందర్భానికి ఆయన రాసే డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తుంటాయి. అలాంటిది తన తాజా చిత్రం 'లోఫర్' లో మదర్ సెంటిమెంట్ హైలైట్ అవుతుందని ఆయన అన్నాడు. నిన్న సాయంత్రం జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పాడు.

ఈ సినిమాలో కథానాయకుడు వరుణ్ తేజ్ తల్లిగా రేవతి నటించింది. తల్లీకొడుకుల బంధానికి సంబంధించిన సన్నివేశాలు మనసును కదిలిస్తాయట. అందుకే 'మా అమ్మ మహాలక్ష్మి' అనే టైటిల్ ను కూడా పరిశీలించారు. అయితే యూత్ ను దృష్టిలో పెట్టుకుని పూరి టైటిల్ మార్చలేదు. ఇక ఇది కేవలం యూత్ కి సంబంధించిన సినిమా మాత్రమేనని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడ ఫిక్సయి పోతారోనని, ఇందులోని మదర్ సెంటిమెంట్ గురించి పూరి ప్రస్తావించాడు.
'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమాలో మాదిరిగానే, ఇందులో మదర్ సెంటిమెంట్ హైలైట్ అవుతుందని స్పష్టం చేశాడు. మరి పూరి ప్రయత్నం ఫలించి .. ఆ రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)