ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బాలీవుడ్ కి 'డిక్టేటర్'!

Tue, Dec 08, 2015
'డిక్టేటర్' లో ఓ దృశ్యం
'డిక్టేటర్' లో ఓ దృశ్యం
బాలకృష్ణ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో 'డిక్టేటర్' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఈ నెల 20న ఆడియో వేడుక జరుపుకుని సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను బాలీవుడ్లోను శ్రీవాస్ తెరకెక్కించే అవకాశాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'డిక్టేటర్' బాలకృష్ణ 99వ సినిమాగా రూపొందుతోంది. అందువలన ఆ ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని, అనేక విశేషాలను జోడిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా అటు మాస్ ఆడియన్స్ ను .. ఇటు యూత్ ను ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. బాలకృష్ణ సరసన నాయికలుగా అంజలి .. సోనాల్ చౌహాన్ .. అక్ష అలరించనున్నారు. ఈ సినిమా పనిలో శ్రీవాస్ బిజీగా వుండగా, బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థ ఆయనని సంప్రదించినట్టు సమాచారం. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయమని ఆయనని కోరారట. దాంతో ఈ సినిమా రీమేక్ ద్వారా శ్రీవాస్ బాలీవుడ్లోకి అడుగుపెట్టవచ్చని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)