ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సుహాసిని బాలీవుడ్ ఎంట్రీ

Tue, Dec 08, 2015
సుహాసిని
సుహాసిని
కథానాయికగా ఓ వెలుగు వెలిగిన సమయంలో సుహాసిని హిందీ సినిమాల వైపు చూడనే లేదు. అలాంటిది ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఆమె 'వెయిటింగ్' అనే హిందీ సినిమాలో కీలక పాత్ర పోషించింది. గతంలో 'లండన్, పారిస్, న్యూయార్క్' అనే చిత్రాన్ని తీసిన అనూ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షాకు భార్యగా ఆమె నటించింది. కల్కీ కొచ్చిన్ కూడా ఇందులో మరో ముఖ్య పాత్ర పోషించింది. కాగా, త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం తనకు బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందని సుహాసిని భావిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.211.11.50
Movie News (Latest)