ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కి కోపం వచ్చేసింది!

Mon, Dec 07, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ కి కోపం వచ్చేసింది .. ఇలా అయితే కష్టమని ఆయన దర్శక నిర్మాతలతో చెప్పినట్టుగా తెలుస్తోంది. 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ విషయంలో సరైన ప్లానింగ్ లేకపోవడమే అందుకు కారణమట. 'సర్దార్ గబ్బర్ సింగ్' సెట్స్ పైకి ఆలస్యంగా వెళ్లింది. ఇంకా ఆలస్యం జరగకుండా చకచకా పనులు జరిగేలా చూడమని దర్శక నిర్మాతలతో పవన్ చెప్పాడట.

అయితే గుజరాత్ షెడ్యూల్ లోను పవన్ ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని తెలుస్తోంది. దర్శకుడు బాబీ సరైన ప్లాన్ చేసుకోకపోవడం వలన, షూటింగ్ మధ్యలోనే ప్యాకప్ చెప్పాల్సిన పరిస్థితులు తలెత్తాయట. విషయాన్ని గ్రహించిన పవన్ కల్యాణ్ కి కోపం వచ్చిందని అంటున్నారు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తిచేయాలనే దిశగా పనులు జరగక పోవడం పట్ల ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడని చెబుతున్నారు. ఇలా అయితే కష్టమేనని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశాడని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)