ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూ సినిమాపై ఫిల్మ్ నగర్ టాక్!

Mon, Dec 07, 2015
చిరంజీవి
చిరంజీవి
ఇదిగో .. అదిగో .. అంటూనే చిరంజీవి 150వ సినిమా విషయంలో జాప్యం జరిగిపోతోంది. అయితే ఈ విషయానికి సంబంధించిన ఒక వార్త తాజాగా ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన సంక్రాంతి పండుగ సందర్భంగా వెలువడవచ్చనేది ఆ వార్త సారాంశం.

చిరంజీవి 150వ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 'బ్రూస్ లీ' సినిమా రిలీజ్ సమయానికే ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుందని చిరంజీవి కూడా చెప్పాడు. కానీ ఎందుచేతనో మళ్లీ ఎప్పటిలానే ఆలస్యం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం చిరంజీవి .. చరణ్ ఇద్దరూ కూడా ఈ సినిమాకి సంబంధించిన కథలు వింటున్నారట. త్వరలోనే తమకి నచ్చిన ఒక కథను ఎంపిక చేసి, సంక్రాంతి పండుగ సందర్భంగా ఎనౌన్స్ చేసే అవకాశం వుందని అంటున్నారు. అదే నిజమైతే మెగా అభిమానులకి అంతకన్నా కావలసినదేముంటుంది?
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)