ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'బాహుబలి 3'లో ప్రభాస్ వుండడట!

Mon, Dec 07, 2015
విజయేంద్రప్రసాద్
విజయేంద్రప్రసాద్
అవును .. 'బాహుబలి 3'లో హీరో ప్రభాస్ ఉండడట. ఈ విషయాన్ని చిత్ర కథకుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైందని కూడా ఆయన తెలిపారు. అయితే ఇందులో ప్రభాస్ .. సత్యరాజ్ .. వంటి పాత్రలు కనిపించవంటూ ఆయన అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. ఓ తమిళ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆయన ఈ విషయాన్ని గురించి చెప్పాడు. 'బాహుబలి' సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించినది అందరికీ తెలిసిందే. దాంతో అంతా 'బాహుబలి 2' పైన దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ, 'బాహుబలి 3'ని కూడా రూపొందించే ఆలోచన ఉన్నట్టుగా చెప్పాడు. అయితే అది కొత్తగా .. ప్రత్యేక ప్రపంచంగా అనిపిస్తుందని ఆయన అన్నాడు. ఇక తాజాగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, తాను 'బాహుబలి 3'కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాననీ, అంతా అనుకుంటున్నట్టుగా ఇందులో ప్రభాస్ తదితరులు ఉండరని అన్నాడు. ఆయన చెప్పిన ఈ మాటతో 'బాహుబలి 3 'ఎలా ఉండబోతోంది? .. అందులో నటీనటులుగా ఎవరెవరు కనిపించబోతున్నారు? అనే ఆసక్తికి తెరలేవడం ఖాయమని చెప్పొచ్చు.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)