ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆడియో రిలీజ్ కి ఎన్టీఆర్ మూవీ రెడీ!

Mon, Dec 07, 2015
ఎన్టీఆర్
ఎన్టీఆర్
'నాన్నకు ప్రేమతో' సినిమా ఆడియో వేడుకకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ ను ఈ నెల 25న చేయాలనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ - రకుల్ జంటగా ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుగుతోంది. ముఖ్యపాత్రలకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

డిసెంబర్ 20 వరకూ కొనసాగే ఈ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. అందువలన ఆడియో వేడుకను 25న జరపాలనే దిశగా ఆలోచన చేస్తున్నారని అనుకుంటున్నారు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన పాటల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జగపతిబాబు - రాజేంద్రప్రసాద్ ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి పండుగకు విడుదల చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)