ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రకుల్ ఆశలు సంక్రాంతిపైనే!

Sun, Dec 06, 2015
రకుల్
రకుల్
సంక్రాంతి పండుగ కోసం రకుల్ ఆశగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే, ఎన్టీఆర్ జోడీగా ఆమె నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమా ఈ పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా హిట్ తనకి చాలా అవసరమనే విషయం రకుల్ కి బాగా తెలుసు. రకుల్ కి వరుసగా అగ్ర కథానాయకుల సరసన ఛాన్స్ తగిలింది. కొత్తగా వచ్చిన కొంతమంది కథానాయికలు అసూయ పడేంతగా ఆమె దూసుకుపోయింది.

అయితే ఆమె రామ్ తో నటించిన 'పండుగ చేస్కో' మాత్రమే ఫరవాలేదనిపించుకుంది. ఆ తరువాత రవితేజతో చేసిన 'కిక్ 2' .. చరణ్ తో చేసిన 'బ్రూస్ లీ' సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఈ ఏడాదిలో చాలా తక్కువ గ్యాప్ లో విడుదలైన ఈ రెండు సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఆ ప్రభావం రకుల్ కెరియర్ పై పడే అవకాశం లేకపోలేదు. కథానాయికగా తాను ఇదే రేంజ్ లో కొనసాగాలంటే, సాధ్యమైనంత త్వరగా ఒక హిట్ పడాలని రకుల్ భావిస్తోంది. ఆ హిట్ 'నాన్నకు ప్రేమతో' ద్వారా లభిస్తే, కొత్తసంవత్సరం మరింత ఆశాజనకంగా ఉంటుందని అనుకుంటోంది. మరి ఈ సంక్రాంతికి ఆమె కోరిక నెరవేరుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)