ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రద్ధా కపూర్ అంతగా కష్టపడిందట!

Sat, Dec 05, 2015
శ్రద్ధా కపూర్
శ్రద్ధా కపూర్
తాను చేయవలసిన పనిపై దృష్టి పెట్టడం .. అనుకున్న సమయంలో ఆ పనిని పూర్తి చేయడంలో శ్రద్ధా కపూర్ ముందువరుసలో కనిపిస్తుందని ఆమెను గురించి తెలిసిన వాళ్లందరూ చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా ఇటీవల జరిగిన ఒక సంఘటన కనిపిస్తోంది. శ్రద్ధా కపూర్ నటిస్తోన్న 'భాగీ' చిత్రం షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. అదే సమయంలో తాను ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న ఒక ఉత్పత్తి సంస్థకి సంబంధించిన మీటింగ్ ముంబయ్ లో ఏర్పాటు చేశారు.

దాంతో, ఒక వైపున షూటింగు ముఖ్యం .. మరో వైపున మీటింగ్ కి హాజరు కావడం అత్యవసరం. అందువలన ఆమె చిన్న విరామం తీసుకుని విమానంలో ముంబాయి వెళ్లింది. అక్కడ పనిచూసుకుని తిరిగి బ్యాంకాక్ కి వచ్చేసింది. అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తి కావాలని దర్శక నిర్మాతలు ముందుగానే చెప్పడం వలన, ఆమె విశ్రాంతి కూడా తీసుకోకుండా తిరిగి షూటింగులో పాల్గొంది. అలా ఏకధాటిగా ఆమె 72 గంటలు పనిచేసిందట. ఆమె సమయపాలన .. క్రమశిక్షణ చూసి అటు ఆమెను ప్రచారకర్తగా ఎంచుకున్నవారు .. ఇటు ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా ఆశ్చర్యపోయారని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)