ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాజల్ తో పాటేసుకున్న'సర్దార్'

Fri, Dec 04, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ వేగాన్ని పుంజుకుంది .. గుజరాత్ లో ఏకధాటిగా ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఒక వైపున రౌడీల భరతం పడుతూనే, మరో వైపున కథానాయికతో కలిసి సర్దార్ సరదాగా పాటేసుకుంటున్నాడు. పవన్ కల్యాణ్ సినిమా అనగానే ఫైట్స్ కి ఎంత ప్రాధాన్యత వుంటుందో, పాటలకి కూడా అంతే ప్రాధాన్యత వుంటుంది.

తన అభిమానులు కోరుకునే ఈ అంశాలపై ఆయన మరింత దృష్టిపెడుతూ వుంటాడు. వాళ్లకి సంతృప్తిని కలిగించే స్థాయిలో అవుట్ పుట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాడు. అదే విధంగా గుజరాత్ లో చిత్రీకరిస్తోన్న దృశ్యాల పైన ఆయన శ్రద్ధపెట్టాడు. అక్కడ చిత్రీకరించిన ఫైట్లు సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. అలాగే కాజల్ తో కలిసి పవన్ పాడుకునే పాట కూడా వినసొంపుగాను .. దృశ్య పరంగాను ఆకట్టుకుంటుందని అంటున్నారు. దర్శక నిర్మాతలు ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)