ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జనవరిలో వస్తానంటోన్న యంగ్ హీరో!

Fri, Dec 04, 2015
రాజ్ తరుణ్
రాజ్ తరుణ్
జనవరి నుంచి తన కొత్త సినిమాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేలా రాజ్ తరుణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. తన తాజా చిత్రం 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' జనవరిలో విడుదలయ్యేలా చూసుకుంటున్నాడు. పూర్ణిమ ఎస్.బాబు నిర్మించిన ఈ సినిమాను, శ్రీనివాస్ గవిరెడ్డి తెరకెక్కించాడు. ఈ సినిమా ఆడియో వేడుకను జనవరి 7న నిర్వహించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అదే నెలలో ఈ సినిమా విడుదలయ్యేలా చూడమని రాజ్ తరుణ్ అంటున్నాడట.

ఇంతవరకూ అతను నటించిన మూడు సినిమాలు అనూహ్యమైన విజయాలను సాధించాయి. ఉయ్యాలా జంపాలా .. సినిమా చూపిస్త మావ తరువాత, ఇటీవల వచ్చిన 'కుమారి 21 F' తో ఆయన హ్యాట్రిక్ కొట్టాడు. ఇక ఆ తరువాత వచ్చే సినిమా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' కావడంతో, ఇక్కడి నుంచి మరో హ్యాట్రిక్ కి లెక్క మొదలవుతుందని అనుకుంటున్నాడట. మరి ఈ సినిమా ఆయన నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)