ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీ మూవీకి భారీ ఆఫర్స్

Thu, Dec 03, 2015
అల్లు అర్జున్
అల్లు అర్జున్
అల్లు అర్జున్ తాజా చిత్రం 'సరైనోడు' ఒక వైపున షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే, మరోవైపున బిజినెస్ జరిగిపోతోంది. అయితే భారీ రేటు చెబుతున్నా డిస్ట్రిబ్యూటర్స్ వెనకాడటం లేదని తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి' సీడెడ్ లో దాదాపు 7 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయింది. ఈసారి 'సరైనోడు' సినిమా 8 కోట్లకి పైగా అమ్ముడైంది. ఈ స్థాయి ధరను చెల్లించి ఈ సినిమా సీడెడ్ రైట్స్ ను ఎన్వీ ప్రసాద్ తీసుకున్నాడు.

ఇక ఇదే విధంగా మిగతా ఏరియాల్లోను అల్లు అర్జున్ గత చిత్రాల కంటే ఎక్కువ రేటుకి ఈ సినిమా బిజినెస్ జరుగుతోందని అంటున్నారు. బోయపాటి టేకింగ్ .. ఈ సినిమాపై గల అంచనాలు .. అల్లు అర్జున్ కి ఇటు యూత్ లోను .. అటు మాస్ లోను విపరీతమైన క్రేజ్ వుండటం ఈ స్థాయి బిజినెస్ కి కారణమని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)