ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గ్యాప్ తర్వాత మళ్లీ హిట్ పెయిర్!

Wed, Dec 02, 2015
కరీనా కపూర్
కరీనా కపూర్
బాలీవుడ్ తెరపై కథానాయకుడిగా హృతిక్ రోషన్ .. కథానాయికగా కరీనా కపూర్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. గతంలో ఈ ఇద్దరు కలిసి యాదే .. మై ప్రేమ్ కీ దివానీ హూ చిత్రాలతో యూత్ ను అలరించారు. ఈ సినిమాలతో ఈ జోడీ అదుర్స్ అనిపించుకున్నా, మళ్లీ వాళ్లిద్దరూ కలిసి నటించే అవకాశం రావడానికి 12 సంవత్సరాలు పట్టింది.

అందువల్లనే ఇప్పుడు ఈ సినిమాను గురించిన చర్చలు బాలీవుడ్లో జోరుగా జరుగుతున్నాయి. ప్రతీకారంతో కూడిన ఒక ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని తెలుస్తోంది. సంజయ్ గుప్తా దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాను రాకేశ్ రోషన్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ 'మొహంజోదారో' సినిమాతో బిజీగా వున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత, ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. హృతిక్ - కరీనా చాలాకాలం తరువాత జోడీ కడుతోన్న ఈ సినిమా, ఎలాంటి సంచలనానికి తెరతీస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)