ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వంశీ సినిమా మరికాస్త ఆలస్యం!

Tue, Dec 01, 2015
వంశీ
వంశీ
వంశీ దర్శకత్వంలో రూపొందనున్న 'ఫ్యాషన్ డిజైనర్ .. సన్నాఫ్ లేడీస్ టైలర్' సినిమా మరికాస్త ఆలస్యం కానుందని తెలుస్తోంది. వంశీ దర్శకత్వంలో .. మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణంలో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఈ సినిమా రానున్నట్టు కొంతకాలం క్రితం చెప్పారు. దాంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఎందుకంటే, గతంలో వచ్చిన 'లేడీస్ టైలర్' సినిమా సూపర్ హిట్ చిత్రాల జాబితాలోకి చేరింది.

దాదాపు ఆ సినిమాకి సీక్వెల్ అన్నట్టుగా ఈ సినిమా రూపొందుతుందని అనడంతో, అంతా హాయిగా నవ్వుకోవచ్చని అనుకున్నారు. కానీ ఏ కారణం చేతనో ఈ సినిమా పట్టాలెక్కడానికి ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. త్వరలో అతను హీరోగా మారుతి దర్శకత్వంలో మరో సినిమా మొదలు కానుంది. ఇక ఈ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వంశీ సినిమా ఉండవచ్చని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)