ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ మెచ్చిన కథానాయిక!

Tue, Dec 01, 2015
దీపికా పదుకొనే
దీపికా పదుకొనే
టాలీవుడ్ అందగాడిగా మహేశ్ బాబుకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనని అభిమానించే వాళ్లు సాధారణ ప్రేక్షకులలోనే కాదు, నటీనటుల్లోను వున్నారు. అలా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న మహేశ్ బాబుకి ఇష్టమైన కథానాయిక ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే చాలామందిలో వుంటుంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ కారణంగా ఆ సందేహానికి సమాధానం దొరికింది.

తన ఆల్ టైమ్ ఫేవరేట్ శ్రీదేవి అని మహేశ్ చెప్పాడు. ఇక ఈ జనరేషన్ కి సంబంధించిన వారిలో తాను ఎక్కువగా దీపికా పదుకొనేను అభిమానిస్తానని అన్నాడు. దీపికా పదుకొనే సహజ నటి అనీ .. 'పికూ' చిత్రంలో అద్భుతమైన ఆమె అభినయం తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న దీపికా పదుకొనే ట్విట్టర్ ద్వారా మహేశ్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)