ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కృతికి ఆ కథ బాగా నచ్చిందట!

Mon, Nov 30, 2015
కృతి సనన్
కృతి సనన్
తెలుగు తెరకు తన నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కృతి సనన్, ఆ తరువాత బాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కటిగా అక్కడ అవకాశాలను అందిపుచ్చుకుంటోన్న ఆమెకి, తాజాగా మరో హిందీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. సుశాంత్ సింగ్ రాజ్ పుట్ కథానాయకుడిగా, దర్శకుడు మొహిత్ సూరి ఒక సినిమాను తెరకెక్కించనున్నాడు. చేతన్ భగత్ రాసిన 'హాఫ్ గాళ్ ఫ్రెండ్' అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది.

ఈ సినిమానులో కథానాయిక పాత్ర కోసం కృతి సనన్ ను సంప్రదించారు. అయితే ఆమె ఆ నవలను ఇంతకు ముందే చదివింది. దీంతో తన పాత్రపై ఆమెకు ఓ అవగాహన వుంది. ఈ నవల చాలా బాగుందనీ .. తనకి బాగా నచ్చిందని కృతిసనన్ అంటోంది. ఇక ఈ సినిమాకి తాను డేట్స్ అడ్జెస్ట్ చేయవలసి వుందని చెబుతోంది. మరి ఆమెకి అంతగా నచ్చిన కథతో రూపొందే ఈ సినిమా, ఆమె కెరియర్ స్పీడ్ ను మరింతగా పెంచుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)