ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆసక్తిని రేకెత్తిస్తోన్న కొత్త టైటిల్స్ !

Mon, Nov 30, 2015
గుణశేఖర్
గుణశేఖర్
ఏ సినిమా అయినా జనంలోకి వెళ్లడంలో ఆ సినిమా టైటిల్ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. అందుకే టైటిల్ విషయానికి దర్శక నిర్మాతలు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుంటారు. వివిధ రకాల టైటిల్స్ పై కసరత్తు చేసి మరీ ఆ టైటిల్స్ ను రిజిష్టర్ చేయిస్తుంటారు. అలా తాజాగా కొంతమంది దర్శక నిర్మాతలు ఫిల్మ్ చాంబర్లో తాము అనుకున్న టైటిల్స్ ను రిజిష్టర్ చేయించారు.

'ఫీల్ మై లవ్' అనే టైటిల్ ను దిల్ రాజు, 'ఆరడుగుల బుల్లెట్'ను బీవీఎస్ఎన్ ప్రసాద్, 'గరుడ'ను మంచు విష్ణు, 'రాయబారి'ని క్రిష్, 'గోన గన్నారెడ్డి'ని గుణశేఖర్ రిజిష్టర్ చేయించారు. ఇక 'దందా' అనే టైటిల్ ను ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ రిజిష్టర్ చేయించినట్టుగా తెలుస్తోంది. గతంలో 'ప్రతాపరుద్రుడు' అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించిన గుణశేఖర్, 'గోన గన్నారెడ్డి'ని కూడా రిజిష్టర్ చేయించడం, రాజమౌళి సినిమాగా రానుందనుకున్న 'గరుడ' టైటిల్ ను విష్ణు రిజిష్టర్ చేయించడం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)