ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ అదే దారిలోకి వచ్చిన శింబు!

Sat, Nov 28, 2015
శింబు
శింబు
తమిళ కథానాయకులలో శింబూకి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. జయాపజయాలకి అతీతంగా ఆయనకి యూత్ లో ఫాలోయింగ్ వుంది. అలాంటి శింబు .. తన సినిమా కోసం ఒక కొత్త కథను రెడీ చేసుకుంటున్నాడట. ఇంతవరకూ తాను చేసిన సినిమాలకి పూర్తి భిన్నంగా ఉండేలా ఆయన ఈ కథను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయకుడిగా తాను నటించడమే కాదు .. తానే దర్శకత్వం కూడా వహించాలనేది ఆయన ఆలోచనని చెబుతున్నారు.

శింబూకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు రాయడంపై మంచి పట్టువుంది. అప్పుడప్పుడు పాటలు కూడా తానే పాడేస్తూ వుంటాడు. ఇక ఆయన సినిమాలో సూపర్ హిట్ అనిపించుకున్న 'వల్లవన్'కి కథ ఆయనదే .. దర్శకుడు ఆయనే. ఆ తరువాత నటనపై మాత్రమే దృష్టిపెట్టిన ఆయన, ఇటీవల ఆశించిన స్థాయిలో విజయాలు లేకపోవడంతో మళ్లీ 'కథ'న రంగంలోకి దిగాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి శింబు అదే దారిలోకి వచ్చాడని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)