ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తెలుగు తెరపైకి కొత్త ప్రేమకథ!

Fri, Nov 27, 2015
నాగశౌర్య
నాగశౌర్య
యూత్ ఎక్కువగా ప్రేమకథలనే కోరుకుంటుంది. ప్రేమకథను ఫీల్ తో చెప్పగలగాలేగాని బ్రహ్మరథం పడుతుంది. విజయవంతమైన ఎన్నో ప్రేమకథా చిత్రాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. అలాంటి ప్రేమకథా వస్తువుతో రూపొందిన 'అబ్బాయితో అమ్మాయి' చిత్రం క్రిస్మస్ సందర్భంగా వచ్చేనెల 25న విడుదల కానుంది. నాగశౌర్య - పల్లక్ లల్వాని జంటగా నటించిన ఈ సినిమాకి, రమేష్ వర్మ దర్శకుడిగా వ్యవహరించాడు.

ఈ సినిమా నిర్మాతలు మాట్లాడుతూ, విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు. దర్శకుడు రమేష్ వర్మ ఈ కథను ఒక కావ్యంగా మలిచాడని అన్నారు. టైటిల్ .. పోస్టర్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను తెరకెక్కించాడని చెప్పారు. విజయవంతమైన ప్రేమకథా చిత్రాల సరసన తమ సినిమా నిలుస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)