ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హిట్ కాంబినేషన్ తో ప్రభుదేవా సినిమా!

Fri, Nov 27, 2015
జయం రవి
జయం రవి
ప్రభుదేవా తన సొంత బ్యానర్ పై ఒక సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తమిళ్లో నిర్మించనున్న ఈ సినిమా కోసం హీరోగా జయం రవిని, హీరోతో సమాన ప్రాధాన్యత గల పాత్ర కోసం అరవింద్ స్వామిని ఎంచుకున్నట్టు సమాచారం.
ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇటీవల వచ్చిన 'తని ఒరువన్' విశేషమైన ఆదరణ పొందింది. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా, అయిదు భాషల్లో రీమేక్ గా సెట్స్ పైకి వెళుతోంది. అందువలన ఈ సినిమాలో నటించిన జయం రవికి .. అరవింద్ స్వామికి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ వుంది.

ఈ క్రమంలో ప్రభుదేవా ఇప్పటికే జయం రవిని ఒప్పించాడట. ఇక అరవింద్ స్వామి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వుందని అంటున్నారు. ఆయన ఓకే అనే సూచనలే ఎక్కువగా వున్నాయని చెప్పుకుంటున్నారు. ప్రభుదేవా నిర్మిస్తోన్న ఈ సినిమాకి లక్ష్మణ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)