ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనుష్కకు రాజమౌళి డెడ్ లైన్!

Fri, Nov 27, 2015
అనుష్క
అనుష్క
అందాల అనుష్కకి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితే ఎదురైంది. 'సైజ్ జీరో' కోసం బరువు పెరిగిన ఆమె, ఇప్పుడు 'బాహుబలి 2' కోసం బరువు తగ్గవలసి వస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సమయం దగ్గర పడుతుండటం ఆమెను కాస్త టెన్షన్ పెట్టే విషయమే. 'సైజ్ జీరో' పాత్ర కోసం అనుష్క 17 కేజీల బరువు పెరిగింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత, ఆమె వెంటనే బరువు తగ్గడానికి ప్రయత్నం చేసిందట.

అయితే 'సైజ్ జీరో' ప్రమోషన్ వరకూ ఆ పాత్రకి తగినట్టుగా కనిపించమని దర్శక నిర్మాతలు కోరడంతో, ఏడు కేజీల బరువు మాత్రమే తగ్గిందట. ఇక ఈ లోగా 'బాహుబలి 2' సినిమా షూటింగ్ కి సంబంధించి అన్నిరకాల ఏర్పాట్లు చివరిదశకి చేరుకున్నాయి. వచ్చేనెల 17న షూటింగును ఆరంభించనున్నారు. షూటింగ్ మొదలైన వారం రోజుల్లోగా బరువు తగ్గేసి జాయిన్ కావాలని రాజమౌళి ఆమెకి చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఆ లోగా 10 కేజీల బరువు తగ్గడం కోసం అనుష్క ఏ స్థాయిలో కసరత్తు చేస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)