ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మళ్లీ ఎన్టీఆర్ జోడీగా సమంతా!

Fri, Nov 27, 2015
సమంతా
సమంతా
అవును .. మళ్లీ ఎన్టీఆర్ తో జోడీ కట్టడానికి సమంతా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం, కథానాయికగా సమంతాను ఎంపిక చేసినట్టు సమాచారం. ఎన్టీఆర్ .. కొరటాల శివ కాంబినేషన్లో 'జనతా గేరేజ్' పేరుతో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తోన్న 'నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగ్ పూర్తికాగానే, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకునే అన్నిరకాల అంశాలను మేళవిస్తూ తెరకెక్కనున్న ఈ సినిమాలో, కథానాయిక సమంతా అయితే బాగుంటుందని కొరటాల భావించాడట. ఆయన సమంతాను కలిసి కథ వినిపించగా, ఆనందంతో ఆమె ఓకే చెప్పేసిందని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ - సమంతా కలిసి బృందావనం .. రామయ్యా వస్తావయ్యా .. రభస సినిమాల్లో నటించారు. ఈ సినిమాతో సమంతా నాలుగోసారి ఎన్టీఆర్ తో జోడీ కడుతుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)