ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సీక్వెల్ మొదలెట్టనున్న బాలకృష్ణ

Fri, Nov 27, 2015
బాలకృష్ణ
బాలకృష్ణ
బాలకృష్ణ కథానాయకుడిగా గతంలో చేసిన 'ఆదిత్య 369' సీక్వెల్ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ఈ సీక్వెల్ రూపకల్పనకి సన్నాహాలు మొదలుకావొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఈ సీక్వెల్ 'ఆదిత్య 999' పేరుతో తెరకెక్కనుందని అనుకుంటున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1991లో వచ్చిన 'ఆదిత్య 369' మంచి విజయాన్ని సాధించింది. టైమ్ మెషిన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులను అలరించింది.

ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచన బాలకృష్ణకి చాలాకాలం నుంచి వుంది. సీక్వెల్ కి సంబంధించిన కథను సింగీతం శ్రీనివాసరావు కొంతకాలం క్రితం వినిపిస్తే, ఆ కథ బాలకృష్ణకి చాలా సంతృప్తిని కలిగించిందట. సాయి కొర్రపాటి నిర్మాతగా త్వరలోనే ఈ సీక్వెల్ పట్టాలెక్కవచ్చని అనుకుంటున్నారు. ఇది బాలయ్య నటించే వందవ సినిమా 'గాడ్ ఫాదర్' తరువాత ఉండవచ్చని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)