ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ మూవీ మహేశ్ చేయాల్సిందట!

Wed, Nov 25, 2015
మహేశ్ బాబు
మహేశ్ బాబు
సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతోన్న '24' సినిమా .. తెలుగులో మహేశ్ చేయవలసిన సినిమా అట. కొన్ని కారణాల వలన ఆ సినిమా సూర్యకి వెళ్లిందని తెలుస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో .. సూర్య నిర్మాతగా '24' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సమంతా కథానాయికగా నటిస్తోంది.

భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్టులుక్ ఇటీవల విడుదలై, అందరిలోనూ ఆసక్తిని పెంచింది. అలాంటి ఈ కథను విక్రమ్ కుమార్ తెలుగులో మహేశ్ బాబుతో తెరకెక్కించి తమిళ్లోను రిలీజ్ చేయాలని అనుకున్నాడట. మహేశ్ ను కలిసి కథను వినిపించాడట. అయితే ఈ సైన్స్ ఫిక్షన్ కథాంశం తనకి అంతగా నప్పదని మహేశ్ భావించడంతో, సూర్యను విక్రమ్ కుమార్ సంప్రదించాడు. ఆయన ఓకే అనడంతో ఈ సినిమాను తమిళ్లో తెరకెక్కిస్తూ తెలుగులోనూ విడుదల చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)