ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నోరా ఫతేహితో తమన్నా డాన్స్

Wed, Nov 25, 2015
తమన్నా
తమన్నా
ఐటెమ్ సాంగ్స్ పై తనదైన ముద్ర వేసిన హాట్ బ్యూటీస్ లో నోరా ఫతేహి ప్రత్యేక స్థానంలో కనిపిస్తుంది. అలాంటి హాట్ లేడీతో కలిసి తమన్నా స్టెప్స్ వేస్తుండటం మరింత ఆసక్తిని రేకెత్తించే విషయం. నాగార్జున .. కార్తి .. తమన్నా ప్రధాన పాత్రలను పోషిస్తోన్న 'ఊపిరి' సినిమా, షూటింగ్ చివరిదశలో వుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రత్యేక గీతాన్ని హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు.

ఈ పాటలో నోరా ఫతేహితో కలిసి తాను కూడా స్టెప్స్ వేస్తున్నానని తమన్నా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ పాట చాలా బాగుంటుందనీ, ఆడియన్స్ ని ఎంతగానో అలరిస్తుందని ఆమె చెప్పింది. ఈ పాట, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా అనిపిస్తుందని ఈ సినిమా టీమ్ అంది. పీవీపీ బ్యానర్ పై వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)