ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రేమకథకి మరో నాయిక దొరికేసింది!

Wed, Nov 25, 2015
ఐషాశర్మ
ఐషాశర్మ
'ప్రేమమ్' తెలుగు రీమేక్ కి చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ ఇద్దరు కథానాయికలను ఎంపిక చేసిన ఈ సినిమా టీమ్, తాజాగా మరో కథానాయికగా 'ఐషాశర్మ'ను సెలెక్ట్ చేసింది. మలయాళంలో 'ప్రేమమ్' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా, యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ముందుకు వచ్చారు.

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. కథ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు వుంటారు. ఇంతకుముందే శ్రుతిహాసన్ ను .. అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేశారు. తాజాగా మూడవ నాయికగా 'ఐషాశర్మ'ను తీసుకున్నారు. ఈ సినిమాకి టైటిల్ 'మజ్ను ' అనుకున్నా, అది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ నెల 30న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుని, వచ్చేనెల 1వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళుతోంది.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)