ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అడ్వాన్సును మహేశ్ తిరిగిచ్చేశాడా?

Tue, Nov 24, 2015
మహేశ్ బాబు
మహేశ్ బాబు
నిర్మాత రాధాకృష్ణకి మహేశ్ బాబు అడ్వాన్స్ ను తిరిగిచ్చేశాడనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. మహేశ్ తో ఒక సినిమా చేయడం కోసం రాధాకృష్ణ ముందుగానే భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చాడనీ, వరుస సినిమాలతో తాను బిజీగా ఉన్నందువలన మహేశ్ ఆ అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేశాడని అంటున్నారు. గతంలో మహేశ్ తో ఒక సినిమా చేయాలనీ అశ్వనీదత్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కూడా, ఆ సినిమా విషయంలో ఆలస్యమవుతూ ఉండటంతో మహేశ్ తిరిగి ఇచ్చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

హాసినీ - హారిక బ్యానర్ పై పలు సినిమాలను నిర్మిస్తోన్న రాధాకృష్ణ, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ తో ఒక సినిమా చేయడం కోసం ఆయనకి 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాడట. తాను ఇచ్చిన డేట్స్ లోగా కథ రెడీ కాకపోవడంతో, ఆ అడ్వాన్స్ ను మహేశ్ తిరిగి ఇచ్చేశాడని అంటున్నారు. అయితే ఈ వార్తలో నిజం లేదనీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ కథానాయకుడిగా రాధాకృష్ణ సినిమా చేసే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.167.129.169
Movie News (Latest)