ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సైజ్ జీరో సత్యానంద్ గా ప్రకాశ్ రాజ్?

Tue, Nov 24, 2015
ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్
'సైజ్ జీరో' విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో, ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ విలన్ గా నటించాడనేదే ఆ వార్త సారాంశం. ఆయన ఈ సినిమాలో సైజ్ జీరో సత్యానంద్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.

'సైజ్ జీరో' సినిమా సందేశంతో కూడిన ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. సైజ్ జీరోకి సంబంధించే, అనుష్క .. ఆర్య .. సోనాల్ చౌహాన్ పాత్రల మధ్య వినోదభరితమైన సన్నివేశాలు వుంటాయి. కథలో ఆసక్తికరమైన మలుపులు బాగానే వున్నట్టు తెలుస్తోంది. ఆ మలుపుల్లో ఒకటిగా రెండవ భాగంలో ప్రకాశ్ రాజ్ విలనిజం ప్రాధాన్యతను సంతరించుకుంటుందని చెప్పుకుంటున్నారు. ఆయన విలనిజం ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. అదే నిజమైతే .. ఈ సినిమా మరింత రసవత్తరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)