ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవిశ్రీతో పవన్ అలా అన్నాడట!

Tue, Nov 24, 2015
దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీ ప్రసాద్
'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా కోసం ఆయన చేసిన ఒక మాస్ బీట్ పవన్ కల్యాణ్ కి బాగా నచ్చేసిందట. దాంతో ఆ బీట్ కి తగినట్టుగా స్టెప్స్ తో ఆడియన్స్ ను అలరించాలని ఆయన డిసైడైపోవడమే కాకుండా, ఆ విషయాన్ని దేవిశ్రీ ప్రసాద్ కి ఫోన్ చేసి మరీ చెప్పాడట. తాను సంగీతాన్ని అందించిన 'కుమారి 21 F' సక్సెస్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ, ఈ విషయం గురించి చెప్పాడు.

'సర్దార్ గబ్బర్ సింగ్' ట్యూన్స్ ని వినిపించడం కోసం పవన్ కి దేవిశ్రీ పంపించిన తరువాత ఆయన నుంచి ఫోన్ కాల్ వచ్చిందట. ఈ సినిమా కోసం దేవిశ్రీ చేసిన మాస్ బీట్ అదిరిపోయిందని పవన్ అన్నాడట. ఈ ట్యూన్ తో తనకి మాంచి కిక్ వచ్చిందనీ, ఆయన చేసిన బీట్ కి మించి తాను డాన్స్ చేస్తానని చెప్పాడట. పవన్ కి ఆ స్థాయి ఉత్సాహాన్ని కలిగించే సాంగ్ ఇవ్వగలిగినందుకు .. ఆయన ప్రశంసను అందుకున్నందుకు హ్యాపీగా వుందని దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)