ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీకాంత్ అంటే అంతే మరి!

Tue, Nov 24, 2015
రజనీకాంత్ .. ఇటు టాలీవుడ్లోను అటు కోలీవుడ్లోను ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన ఒక సినిమా చేస్తుంటే, ఆయన అభిమానుల దృష్టంతా ఆ వైపే వుంటుంది. అలా ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోన్న చిత్రం 'కబాలి'. ఇప్పటివరకూ 90 శాతం షూటింగ్ పార్టును పూర్తిచేసిన ఈ సినిమా యూనిట్, మరో 10 శాతం షూటింగ్ కోసం చెన్నైలో ఏర్పాట్లు చేసుకుంటోంది.

రంజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, మొదటి షెడ్యూల్ ను చెన్నైలో పూర్తిచేసుకుంది. ఆ తరువాత మలేసియా వెళ్లిన ఈ సినిమా టీమ్, నెల రోజులుగా అక్కడ కీలకమైన దృశ్యాలను చిత్రీకరించి ఆ షెడ్యూల్ ను పూర్తిచేసింది. తిరిగి చెన్నై చేరుకున్న టీమ్, తదుపరి షెడ్యూల్ ను డిసెంబర్ మొదటివారంలో ప్లాన్ చేశారు. ఈ సినిమా షూటింగును అనుకున్న సమయానికి పూర్తి చేయగలగడానికి కారణం రజనీ అందించిన సహాయ సహకారాలని దర్శకుడు రంజిత్ అంటున్నాడు. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, తెలుగులో 'మహాదేవ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)