ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో ఛాన్స్ కొట్టేసిన అనసూయ!

Mon, Nov 23, 2015
అనసూయ
అనసూయ
అందరూ అనుకున్నట్టుగానే నటిగా అనసూయ తన కెరియర్ స్పీడ్ పెంచింది. అందులో భాగంగానే ఆమె మరో ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. అడివి శేషు - ఆదాశర్మ జంటగా నటిస్తోన్న ఒక సినిమాలో ఆమె కీలకమైన పాత్రను చేయనుందని అంటున్నారు. అడివి శేషు - ఆదాశర్మ కాంబినేషన్లో 'క్షణం' అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రవికాంత్ పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉండటంతో, అది అనసూయ చేస్తే బాగుంటుందని ఈ సినిమా యూనిట్ భావించిందట. కథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో, ఈ సినిమా చేయడానికి అనసూయ ఓకే చెప్పేసిందని అంటున్నారు. 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా రిలీజ్ కాకమునుపే అనసూయ మరో ఛాన్స్ దక్కించుకుంది. మరి ఈ సినిమాలు విడుదలైన తరువాత అనసూయ కాల్షీట్స్ దొరుకుతాయో లేదో!
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)