ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దేవిశ్రీప్రసాద్ అలా స్పందించాడు

Mon, Nov 23, 2015
దేవిశ్రీప్రసాద్
దేవిశ్రీప్రసాద్
దేవిశ్రీప్రసాద్ పేరు చెప్పగానే యూత్ ఒక్కసారిగా హుషారెత్తిపోతుంది. ఆయన పాటలు వింటూ ఉత్సాహంతో గంతులు వేస్తుంది. అలాంటి దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూనే వున్నాయి. ఆయా సినిమా వేడుకలకి సంబంధించిన వేదికలపై ఈ ప్రస్తావన వస్తూనే వుంది. అదే విషయాన్ని ఆయన దగ్గర ప్రస్తావిస్తే, తనదైన శైలిలో స్పందించాడు.

ఇప్పటికీ కొంతమంది హీరోగా చేయమని తనని అడుగుతూనే వున్నారని అన్నాడు. గతంలో కొన్ని కథలు తన దగ్గరికి వచ్చినప్పుడు, అవి తనకి సెట్ కావని తానే ఓకే అనలేదని చెప్పాడు. అలా తాను వదులుకున్న సినిమాలు కొన్ని ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయని అన్నాడు. ప్రస్తుతం తన దృష్టి సంగీతం పైనే ఉందనీ, ఇక్కడ తాను సంపాదించుకున్న క్రేజ్ ను నిలబెట్టుకోవడం పైనే దృష్టి పెట్టానని చెప్పాడు. మరి తాను చేస్తే బాగుంటుందనే కథ దేవిశ్రీప్రసాద్ కి ఎప్పుడు దొరుకుతుందో .. ఆయనని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)