ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయనతార భారీగానే డిమాండ్ చేసిందట!

Sat, Nov 21, 2015
నయనతార
నయనతార
కొంతకాలం క్రితం వరకూ తెలుగు .. తమిళ భాషా చిత్రాలకు నయనతార సమానమైన ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ఆ తరువాత ఆమె తమిళ సినిమాలను ఎక్కువగా అంగీకరిస్తూ అక్కడ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఒక తెలుగు సినిమా విషయంలో ఆమెను సంప్రదిస్తే, పెద్దమొత్తంలో రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార తమిళ్లో పారితోషికంగా కోటిన్నర తీసుకుంటోందట.

వెంకటేశ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'రాధాకృష్ణ' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నయనతారను సంప్రదిస్తే, ప్రస్తుతం తమిళ్లో తీసుకునే దానికంటే ఎక్కువగా అడిగినట్టు వినికిడి. చేతిలో పెద్దగా సినిమాలు లేనప్పుడే నయనతార రెమ్యునరేషన్ తగ్గించుకునే ఆలోచన చేయలేదు. ఇక ఇప్పుడు ఆమె వరుస సక్సెస్ లలో వుంది. అందువలన ఆమె ఆ రేంజ్ లో పారితోషికాన్ని డిమాండ్ చేసి ఉంటుందని అనుకుంటున్నారు. ఇక వెంకీకి తగిన సీనియర్ కథానాయిక దొరకడం కూడా కష్టమే. దర్శక నిర్మాతలు ఒప్పుకోవడానికి అది కూడా ఒక కారణమని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)