ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ బాబు సరసన బాలీవుడ్ భామ!

Sat, Nov 21, 2015
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మహేశ్ బాబు కథానాయకుడిగా ఒక సినిమాను తెరకెక్కించడానికి దర్శకుడు మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీగా బాలీవుడ్ భామ అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడని తెలుస్తోంది. శ్రద్ధా కపూర్ .. అలియాభట్ పేర్లను పరిశీలిస్తున్నారట. ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని తీసుకోవడం మాత్రం ఖాయమని అంటున్నారు.

మహేశ్ బాబుకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, తనదైన స్టైల్లో మురుగదాస్ ఈ కథను రెడీ చేశాడు. సామాజిక సందేశం ఇందులో అంతర్లీనంగా ఉంటుందట. 'బ్రహ్మోత్సవం' తరువాత మహేశ్ చేయనున్న ఈ సినిమాను 'ఉగాది'కి లాంచ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను తెలుగు .. తమిళ్ భాషలతో పాటు హిందీలోను రిలీజ్ చేయాలనే ఆలోచన కారణంగానే, బాలీవుడ్ కథానాయికలకి మురుగదాస్ ప్రాధాన్యతను ఇస్తున్నాడని అంటున్నారు. గతంలో కొంతమంది బాలీవుడ్ కథానాయికలు మహేశ్ సినిమా ద్వారానే టాలీవుడ్ కి పరిచయమయ్యారు. మరి ఈసారి ఆ ఛాన్స్ శ్రద్ధాకపూర్ కి లభిస్తుందో .. అలియాభట్ కి దొరుకుతుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)