ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నట వారసుడి మరో ప్రయత్నం

Fri, Nov 20, 2015
గౌతమ్
గౌతమ్
నటుడిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం తెలుగు తెరపైకి వచ్చిన కథానాయకులలో, బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ కూడా ఉన్నాడు. గతంలో చేసిన ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ ను ఇవ్వకపోయినా, మళ్లీ రంగంలోకి దిగడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

గౌతమ్ కథానాయకుడిగా రూపొందిన 'పల్లకిలో పెళ్లికూతురు' .. 'వారెవా' .. ' బసంతి' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే కథాపరంగా ఈ సినిమాలేవీ ఆయన కెరియర్ కి అంతగా ఉపయోగపడలేదు. అయినా కాస్త గ్యాప్ తీసుకుని మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా రమేష్ దర్శకత్వంలో సంక్రాంతి రోజున ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'వాడెవడు?' అనే టైటిల్ ను ఖరారు చేసే ఆలోచనలో వున్నారు. మరి ఈ సినిమాతోనైనా గౌతమ్ కి హిట్ పడుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)