ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లారెన్స్ కొత్త సినిమా సందడి షురూ

Thu, Nov 19, 2015
లారెన్స్
లారెన్స్
లారెన్స్ కథానాయకుడిగా 'పటాస్' రీమేక్ సెట్స్ పైకి వెళ్లింది. శ్రీరమణి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ నిన్నటి నుంచి మొదలైంది. తమిళ్లో ఈ సినిమా 'మొట్ట శివ కెట్ట శివ ' పేరుతో ప్రేక్షకులను అలరించనుంది. తమిళ్లో హారర్ సినిమాలతో ప్రేక్షకులను భయపెడుతూ .. తెలుగులోను భారీ వసూళ్లను రాబడుతూ వస్తోన్న లారెన్స్, 'పటాస్' రీమేక్ పై కన్నేశాడు.

తమిళనాట లారెన్స్ కి మంచి మాస్ ఫాలోయింగ్ వుంది. అందువలన ఆయన ఈ కథని ఇష్టపడినట్టుగా చెబుతున్నారు. తెలుగులో కల్యాణ్ రామ్ పోషించిన పాత్రని ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా మార్చుకున్నాడు. ఇక సాయికుమార్ పాత్రలో సత్యరాజ్ నటించనున్నాడు. ఆర్.బి.చౌదరి నిర్మిస్తోన్న ఈ సినిమా కోసం త్వరలోనే కథానాయికను ఎంపిక చేస్తారట. ఇక నుంచి రెగ్యులర్ షూటింగ్ ను జరుపుతూ .. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)