ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ ఆ రీమేక్ పై దృష్టి పెట్టాడట!

Thu, Nov 19, 2015
ఎన్టీఆర్
ఎన్టీఆర్
తెలుగు కథానాయకులు ఈ మధ్యకాలంలో రీమేక్ లపై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. ఒక వైపున చరణ్ తమిళ చిత్రం 'తని వరువన్' రీమేక్ కి సిద్ధమవుతూ వుంటే, మరో వైపున నాగచైతన్య మలయాళ చిత్రం 'ప్రేమమ్' రిమేక్ తో రంగంలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా ఒక తమిళ రీమేక్ పై దృష్టిపెట్టాడనే టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాయే అజిత్ హీరోగా ఇటీవల విడుదలైన 'వేదాళం'.

శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదలై, తొలివారంలోనే 45 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అజిత్ కి వున్న మాస్ ఇమేజ్ ఈ సినిమాతో మరింత పెరిగింది. ఎన్టీఆర్ కి కూడా మాస్ ఇమేజ్ ఎక్కువ. అందువలన ఈ సినిమాను తెలుగులో తాను చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఎన్టీఆర్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఆయన ఈ ప్రాజెక్టును కొరటాల శివకి అప్పగిస్తాడా? లేదంటే ఆ తరువాత సినిమాగా రెడీ చేసుకుంటాడా? అనేది చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)