ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'లోఫర్'కి పది లక్షల హిట్లు!

Thu, Nov 19, 2015
'లోఫర్' లో ఓ దృశ్యం
'లోఫర్' లో ఓ దృశ్యం
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా రూపొందిన 'లోఫర్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో 10 రోజుల్లోనే 10 లక్షల మందికి పైగా ఈ ట్రైలర్ ను వీక్షించడం విశేషం. ఇది పూరి సినిమా కావడం .. యూత్ లో వరుణ్ తేజ్ కి ఫాలోయింగ్ పెరగడం ఇందుకు కారణమని చెబుతున్నారు.

వరుణ్ తేజ్ దొంగగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన జోడీగా దిశా పతాని కనిపించనుంది. ఇక వరుణ్ తల్లిదండ్రులుగా రేవతి - పోసాని కృష్ణమురళి నటించారు. కథ .. కథనాలను చకచకా రెడీ చేసుకోవడం .. అంతకన్నా వేగంగా ఆ సినిమాను పూర్తిచేయడంలో పూరి సిద్ధహస్తుడు. అదే స్టైల్లో ఆయన తెరకెక్కించిన ఈ సినిమా, వచ్చేనెల 7న ఆడియో వేడుకను జరుపుకోనుంది. ఈ ట్రైలర్ చూసిన వాళ్లు .. వరుణ్ తేజ్ కి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)