ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో కథానాయికను ఎంపిక చేసిన పూరి!

Thu, Nov 19, 2015
పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్
పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా 'రోగ్' కోసం మరో కథానాయికను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఒక కథానాయికగా 'అమైరా దస్తూర్'ను తీసుకున్నాడు. తాజాగా రెండో కథానాయిక కోసం 'ఏంజిలా క్రిస్లిమ్'ను ఎంపిక చేశాడు. ఇక 'రోగ్' ఇద్దరు కథానాయికలతో రొమాన్స్ చేయనున్నాడన్న మాట.

వరుణ్ తేజ్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లోఫర్' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగానే పూరి ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాతో ఆయన ఇషాన్ అనే కొత్త కుర్రాడిని కథానాయకుడిగా పరిచయం చేయనున్నాడు. తెలుగు .. కన్నడ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే పక్కగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న పూరి, ఈ నెలాఖర్లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. పూరి తన సహజమైన శైలిలోనే ఈ సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా ఫినీష్ చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)