ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సింగర్ సునీత ఇలా నవ్వించేస్తోంది!

Wed, Nov 18, 2015
సునీత
సునీత
గాయనిగా .. యాంకర్ గా .. డబ్బింగ్ కళాకారిణిగా సునీతకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎప్పుడు చూసినా చిరుమందహాసం చేస్తూ కనిపించే సునీత, ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది. ఆమె చేసిన హాస్యప్రధానమైన ఒక డబ్ స్మాష్ తాజాగా యూ ట్యూబ్ లో దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ బిజీగా వుండే సునీత .. ఈ మధ్య కాస్తంత విరామం దొరికితేచాలు, తనకి నచ్చిన అంశాన్ని తీసుకుని అందులో నటిస్తూ .. దానిని పోస్ట్ చేస్తూ అలరిస్తోంది.

తాజాగా కోవై సరళ మాదిరిగా నటించాలనుకున్న ఆమె, 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమాలో బ్రహ్మానందంతో కలిసి కోవై సరళ నటించిన ఒక సన్నివేశాన్ని ఎంచుకుంది. ఆ సన్నివేశంలో తన స్నేహితురాలి భర్తతో కలిసి ఆమె కోవై సరళను అనుకరిస్తూ నటించింది. ఆమె చేసిన ఈ డబ్ స్మాష్ ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లు సునీతలో మంచి నటి కూడా వుందని ప్రశంసిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)