ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అనసూయ పారితోషికం హాట్ టాపిక్!

Tue, Nov 17, 2015
అనసూయ
అనసూయ
అందానికీ .. చలాకీతనానికి చిరునామాగా అనసూయ పేరు కనిపిస్తుంది. బుల్లితెరపై ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన గ్లామర్ తో .. జోష్ తో కూడిన మాటకారితనంతో ఆమె ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక ఆయా సినిమా వేడుకలకు కూడా ఆమె యాంకరింగ్ మరింత అందాన్ని తెస్తుంది. అలాంటి అనసూయ తాజాగా ఒక సినిమాలో నటించినందుకు తీసుకున్న పారితోషికం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.

నాగార్జున కథానాయకుడిగా నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. 10 రోజుల పాటు ఈ సినిమా షూటింగులో పాల్గొన్నందుకు ఆమె 40 లక్షల వరకూ పారితోషికంగా తీసుకుందట. దాంతో కొత్తగా వచ్చిన కొంతమంది కథానాయికలకి కూడా ఈ స్థాయి రెమ్యునరేషన్ లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీవీలో ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏదైనా సరే, ఆ కార్యక్రమాన్ని పూర్తిగా తనపై వేసుకుని అనసూయ నడిపిస్తుంది. ఆ సమర్ధత కారణంగానే ఆమె చాలా బిజీగా వుంటుంది. 10 రోజుల పాటు ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి ఆమె ఈ సినిమా చేసింది. అక్కడ ఆమె సంపాదించేదే .. ఇక్కడ తీసుకుందనీ, నాగార్జునతో నటించాలనే ముచ్చటతోనే ఆమె ఆసక్తిని చూపించిందనే వాళ్లూ లేకపోలేదు.
X

Feedback Form

Your IP address: 54.147.212.136
Movie News (Latest)