ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మజ్ను'గా రంగంలోకి చైతూ!

Tue, Nov 17, 2015
నాగ చైతన్య
నాగ చైతన్య
తెలుగు ప్రేక్షకులు ప్రేమకథా చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తూనే వుంటారు. అందువలన సరైన కంటెంట్ తో రావాలే గానీ, అఖండ విజయాన్ని అందించడానికి యూత్ ఎప్పుడూ సిద్ధంగానే వుంటుంది. ఆ విషయాన్ని గ్రహించిన నాగచైతన్య త్వరలో ఒక ప్రేమకథా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .. ఆ సినిమా పేరే 'మజ్ను'. చందూ మొండేటి దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, రేపు హైదరాబాదులో పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది.
డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారట.

మలయాళంలో కుర్రకారు మనసులను పొలోమంటూ దోచేసిన 'ప్రేమమ్' చిత్రానికి రీమేక్ గా 'మజ్ను' రూపొందుతోంది. ఇంతవరకూ చైతూ చేసిన సినిమాల్లో ప్రేమకథా చిత్రాలే ఆయనకి సక్సెస్ ను అందిస్తూ వచ్చాయి. అందువలన ఆయన ఈ రీమేక్ పై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. కథాపరంగా ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు వుంటారు. ఇప్పటికే శ్రుతి హాసన్ ను .. అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసిన దర్శక నిర్మాతలు, మూడో కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగిపోయే ఈ సినిమాతో చైతూకి హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)