ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

3 కోట్లు అడుగుతున్న విలన్!

Tue, Nov 17, 2015
అరవింద్ స్వామి
అరవింద్ స్వామి
ఒకప్పుడు హీరోగా రాణించి, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న అరవింద్ స్వామి తాజాగా మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జయం రవి హీరోగా తమిళంలో వచ్చిన 'థని ఒరువన్' సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా నటించాడు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో బాటు, అరవింద్ స్వామికి మంచి పేరు తెచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఆ విలన్ పాత్రకు అరవింద్ స్వామినే తీసుకోవాలని నిర్ణయించుకున్న దర్శక నిర్మాతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో నటించడానికి ఒప్పుకున్నప్పటికీ, పారితోషికంగా అరవింద్ స్వామి మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. దీంతో దర్శక నిర్మాతలు డైలమాలో పడ్డట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)