ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఊటీకి వెళ్లనున్న 'బ్రహ్మోత్సవం'

Sat, Nov 14, 2015
మహేశ్ బాబు
మహేశ్ బాబు
'బ్రహ్మోత్సవం' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తరువాత ఈ సినిమా యూనిట్ ఊటీకి షిఫ్ట్ కానుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెలలోనే ఈ సినిమా యూనిట్ ఊటీకి వెళ్లవలసి వుంది. అయితే కొన్ని కారణాల వలన మూడవ షెడ్యూల్ ను కూడా హైదరాబాదులోనే మొదలుపెట్టారు.

దాంతో ఊటీ షెడ్యూల్ వచ్చేనెల 8కి వాయిదా పడింది. అప్పటి వరకూ ఫిల్మ్ సిటీలోనే ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. గత రెండు రోజులుగా ఇక్కడ జరుగుతోన్న షూటింగులో మహేశ్ బాబు తో పాటు సత్యరాజ్ తదితరులు పాల్గొంటున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)