ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూరీ కథ అంతగా నచ్చిందట!

Sat, Nov 14, 2015
వరుణ్ తేజ్
వరుణ్ తేజ్
పూరీ జగన్నాథ్ సినిమా అనగానే ఇటు మాస్ ఆడియన్స్ .. అటు యూత్ ఎంతో ఆసక్తిని చూపిస్తారు. అందుకు కారణం ఆయన టైటిల్స్ దగ్గర నుంచి కథకి సంబంధించిన ప్రతి విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శించడమే. ఆ వైవిధ్యం కారణంగానే 'లోఫర్' కథకి తాను ఓకే చెప్పానని వరుణ్ తేజ్ అన్నాడు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ 'లోఫర్' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

హీరోకి పూరీ రాసే డైలాగులు .. హీరోయిన్ ని ఆయన చూపించే తీరు .. పాటల్లోను .. ఫైట్లలో ఆయన తీసుకునే శ్రద్ధ .. కామెడీ విషయంలో తనదైన ముద్ర అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ వుంటాయి. టేకింగ్ విషయంలో ఆయన ఎక్కువ మార్కులు కొట్టేస్తూ వుంటాడు. ఆ టేకింగ్ పై నమ్మకంతోనే ఈ సినిమాను అంగీకరించారా? అని వరుణ్ ని అడిగితే, కొత్తదనంతో కూడిన ఈ కథ బాగా నచ్చిందనీ .. అందుకే ఓకే చెప్పానని ఆయన సమాధానమిచ్చాడు. ఇక ఈ సినిమాలోని మదర్ సెంటిమెంట్ తనకే కాదు .. అందరికీ నచ్చుతుందని ఆయన చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)