ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మారుతి సినిమా టైటిల్ ఇదేనట!

Sat, Nov 14, 2015
వెంకటేశ్
వెంకటేశ్
వెంకటేశ్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి ఒక సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'రాధ .. కృష్ణ' అనే టైటిల్ ను ఆయన పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు.

'భలే భలే మగాడివోయ్' సినిమా హిట్ తో దర్శకుడిగా మారుతికి మరింత క్రేజ్ వచ్చింది. ఆయన తదుపరి సినిమా ఎవరితో అనే ఆసక్తిని ప్రేక్షకులు కనబరుస్తూ ఉండగా, వెంకటేశ్ తో ఉంటుందని చెప్పాడు. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఎంపిక చేశారనే వార్త కూడా బయటికి వచ్చింది. ఇక 'గోపాల గోపాల' సినిమా తరువాత కథలు నచ్చని కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్న వెంకటేశ్, మారుతి ఈ కథ వినిపించగానే ఓకే చెప్పాడట. దాంతో కథలో ఏదో కొత్తదనం వుందనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది. వచ్చేనెలలో ఈ కథను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మారుతి సన్నాహాలు చేస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)