ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పూరీ నెక్స్ట్ మూవీ హీరోయిన్ ఆమెనే!

Fri, Nov 13, 2015
అమైరా దస్తూర్
అమైరా దస్తూర్
పూరీ జగన్నాథ్ తదుపరి సినిమా 'రోగ్'కి కథానాయిక దొరికేసిందనే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అమైరా దస్తూర్ ను ఆయన ఖరారు చేశాడని అంటున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని తెలుగు సినిమాలకి సంబంధించి అమైరా దస్తూర్ పేరు వినిపిస్తూనే వుంది. అయితే ఏయే సినిమాల్లో ఆమెను ఎంపిక చేశారో తెలియదు గానీ, 'రోగ్' సినిమాలో మాత్రం ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.

హిందీ .. తమిళ సినిమాల్లో నటించిన అనుభవం ఈ సుందరికి వుంది. తెలుగు .. కన్నడ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో ఇషాన్ జోడీగా ఆమెకి అవకాశం లభించడం అదృష్టమే. ప్రస్తుతం పూరీ 'లోఫర్' సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా విడుదలైన తరువాత 'రోగ్' కథతో ఆయన సెట్స్ పైకి వెళతాడని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)