ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కంచె'ను బాలీవుడ్ కి తీసుకెళతాడట!

Thu, Nov 12, 2015
'కంచె' లో ఓ దృశ్యం
'కంచె' లో ఓ దృశ్యం
క్రిష్ దర్శకత్వం వహించిన 'కంచె' సినిమా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. దాంతో ఆయన ఈ సినిమాను బాలీవుడ్ కి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. యుద్ధం నేపథ్యంలో ప్రేమ .. బంధాలు .. అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తూ క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు బాలీవుడ్ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది.

దాంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం కొన్ని బాలీవుడ్ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయట. అయితే హిందీలోను ఈ సినిమాను తానే తెరకెక్కించడానికి క్రిష్ ఆసక్తిని చూపిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోతో ఆయన ఈ సినిమాను తెరకెక్కించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఆయన రూపొందించిన 'గబ్బర్' అక్కడ హిట్ కొట్టేసింది. అందువలన 'కంచె' రీమేక్ కి కూడా ఆయనే దర్శకత్వం వహించాలని అనుకుంటున్నాడు. ఆయన దర్శకత్వంలో ఈ సినిమాను చేయడానికి అక్కడి నిర్మాతలు ముందుకు రావొచ్చని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.150.143
Movie News (Latest)