ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూపర్ స్టార్ బాటలో సూర్య

Thu, Nov 12, 2015
సూర్య
సూర్య
రజనీకాంత్ బాటలో సూర్య నడుస్తున్నాడనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. తన సినిమా వలన బయ్యర్లు నష్టపోతే, అందులో కొంత తిరిగి ఇచ్చేయాలని సూర్య నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సూర్యకి ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. ఆయన నటించిన బ్రదర్స్ .. సికిందర్ .. రాక్షసుడు చిత్రాలు బయ్యర్స్ కి భారీ నష్టాలను తెచ్చి పెట్టాయి. ఆ పరాజయాల ప్రభావం సూర్య తాజా చిత్రం '24'పై పడిందట. త్వరలోనే ఈ సినిమా విడుదల చేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు.

ఈ సినిమాను కొనడానికి బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, సూర్య ఒక నిర్ణయానికి వచ్చాడట. తన సినిమా కొనడం వలన బయ్యర్లు నష్టపోతే .. అందులో కొంత తాను తిరిగి చెల్లించాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. గతంలో ఇలా రజనీకాంత్ వ్యవహరించిన సందర్భాలు వున్నాయి. అందువలన సూర్య ఆయన బాటలో వెళుతున్నాడని అనుకుంటున్నారు. సూర్య తీసుకున్న ఈ నిర్ణయం ఆయన ఆశించిన ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)