ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

డప్పేసి చెప్పిన ముద్దుగుమ్మలు

Tue, Nov 10, 2015
తమన్నా - రాశీఖన్నా
తమన్నా - రాశీఖన్నా
తెలుగు తెరపై గ్లామర్ తారలుగా మెరుస్తూ .. ప్రేక్షకులను అలరిస్తోన్న తమన్నా - రాశీఖన్నా డప్పేశారు. తమ సినిమా 'బెంగాల్ టైగర్' చాలా బాగుంటుందనే విషయాన్ని డప్పేసి మరీ చెప్పారు. రవితేజ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో 'బెంగాల్ టైగర్' సినిమా రూపొందింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికలుగా తమన్నా - రాశీఖన్నా కనువిందు చేయనున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వీడియో సాంగ్స్ ను హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తమన్నా- రాశీఖన్నా సరదాగా డప్పులు మోగించి మరీ సందడి చేశారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకి ఇలా శ్రీకారం చుట్టారు. 'బెంగాల్ టైగర్' సినిమా పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిందనీ, అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. 'అఖిల్' సినిమా విడుదల కారణంగా నవంబర్ 11 వ తేదీ నుంచి వాయిదా పడిన ఈ సినిమా, ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)